11-09-2025 01:20:38 AM
ఘనంగా నివాళులర్పించిన నాయకులు
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): తెలంగాణ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ (టీఎన్జీవో) యూనియన్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కుమార్, కార్యదర్శి కుర్రాడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో యూనియన్ కార్యాలయంలో తెలంగాణ బుధవారం వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతిని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి తెలం గాణ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.ఎం. హుస్సేని (ముజీబ్) ముఖ్య అతిథిగా హాజరై నివాళులర్పించి, మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చారిత్రక పాత్రను వివరించారు. నిజాం పాలనలోని అణచివేతకు వ్యతిరేకంగా ఆమె చూపిన ధైర్యం, తిరుగుబాటు తెలంగాణ ప్రజలకు స్ఫూర్తినిచ్చాయని కొనియాడారు.
హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కుమార్ మాట్లాడుతూ.. చకలి ఐలమ్మ వంటి ఎంద రో వ్యక్తుల త్యాగాలు సామాజిక న్యా యం, సమానత్వానికి మార్గం చూపాయని అన్నా రు. కార్యక్రమములో జిల్లా కోశాధికారి జే బాలరాజ్, అసోసియేట్ అధ్యక్షుడు కే ఆర్ రాజ్ కుమార్, వైస్ ప్రసిడెంట్ ఎం.ఏ ముజీబ్, కార్యవర్గం ముఖీమ్ ఖురేషి, వైదిక్ శస్త్ర, శ్రీధర్, ఈ.ఎన్.టీ రాజు, ప్రొహిబిషన్ అండ్ ఎక్ససిస్ సయ్యాద్ క్కుతూబుద్దీన్, నయీమ్, ఈ.స్.ఐ రాజ్కుమార్,ఐ.ట్.ఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.