calender_icon.png 11 September, 2025 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

11-09-2025 01:22:00 AM

-జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలని జిహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ అధికారులను ఆదేశించారు. బుధవారం శేరిలింగంపల్లి జోన్ పరిధి యూసు ఫ్గూడ, ఎర్రగడ్డ, బోరబండ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను  కమిషనర్ ఆర్ వి కర్ణన్ తనిఖీ చేశారు.

క్షేత్రస్థాయిలో చెత్త తొలగింపు, స్వీపింగ్, వ్యర్థాల నిర్వహణపై సాని టేషన్ అదనపు కమిషనర్ రఘు ప్రసాద్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ బోర్కడే హేమంత్ సహదేవ్ రావులతో సమీక్షించారు. స్థానికులతో కమిషనర్ మాట్లాడారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ కమిషనర్  ప్రశ్నించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలు జిహెచ్‌ఎంసీ సిబ్బందికి సహకారం అందించాలని కోరారు.