calender_icon.png 16 September, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీహార్‌పై ఆర్‌ఎస్‌ఎస్ దృష్టి

16-09-2025 12:08:05 AM

  1. ఎన్డీయే కోసం క్షేత్రస్థాయిలో పని చేస్తున్న 20 వేల మంది కార్యకర్తలు
  2. త్వరలోనే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు

పాట్నా, సెప్టెంబర్ 15: బీహార్ ఎన్నికలపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) దృష్టి సారించింది. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి గెలుపు కోసం క్షేత్రస్థాయిలో 20 వేల మంది ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు విధులు నిర్వర్తిస్తున్నారు. ఓటర్ అధికార్ యాత్ర విజయంతో రాష్ట్రంలో ఇండియా కూటమి ఫుల్ జోష్‌లో ఉంది. ఇదే ఊపులో ఎన్నికల్లో గంపగుత్తగా ఓట్లు కొల్లగొట్టాలని చూస్తోం ది. 

ఈ పరిస్థితిని గమనించిన ఆర్‌ఎస్‌ఎస్ రంగంలోకి దిగింది. బీజేపీకి పెద్దన్నలా ఉండే ఆర్‌ఎస్‌ఎస్ 20 వేల మంది కార్యకర్తలను రంగంలోకి దించింది. వీరంతా ఎన్డీయే కూటమి రాబోయే ఎన్నికల్లో విజయం సాధించడం కోసం పని చేయనున్నారు. ప్రస్తుతం బీహార్‌లో ఎస్‌ఐఆర్ రగడ నడుస్తున్న వేళ.. ఎన్డీయే కూటమిపై ప్రజల్లో విశ్వాసం దెబ్బతినకుండా వీరు పని చేయనున్నారు.