23-10-2025 11:08:06 PM
పోలీసుల అదుపులో రైతు..
ఇంద్రవెల్లి (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో ఓ రైతు తన పంట పొలంలో అంతర పంటగా గుట్టు చప్పుడు కాకుండా గంజాయి సాగు చేస్తున్న రైతును పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఎస్సై సాయన్న తెలిపిన వివరాల ప్రకారం... దస్నాపూర్ గ్రామానికి చెందిన కుడే మారుతి(34) తన వ్యవసాయ చేనులో పత్తి పంటతో పాటు అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నట్లు పక్కా సమాచారంతో పంట పొలానికి వెళ్లి చూడగా ఆ రైతు తన చేనులో 12 గంజాయి మొక్కలు లభ్యమయ్యాయన్నారు. వీటి విలువ సుమారు రూ.1 లక్షల 20వేలు ఉంటుందన్నారు. గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని, రైతు కుడే మారుతినీ పోలీస్ స్టేషన్ కు తరలించి, అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.