25-12-2025 01:20:42 AM
కేంద్రాన్ని ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు
న్యూ ఢిల్లీ, డిసెంబర్24 : ప్రతి పౌరుడికి గాలి అవసరం.. అది అందించలేనప్పుడు కనీసం జాతీయ భద్రతా చట్టం కింద తక్షణ చర్యలు చేపట్టలేరా? ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీ తగ్గించలేరా? అని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. వాయు కాలుష్యంతో వేలాది మంది చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.
ఎయిర్ ప్యూరిఫైయర్లను వైద్య పరికరంగా పరిగణించి, వాటిని 5శాతం జీఎస్టీ శ్లాబులోకి తీసుకురావాలని దాఖలైన ప్రజాప్రయోజనం వ్యాజ్యం కోర్టు స్పందించింది. దీనిపై విచారణ జరిపిన డివిజన్ బెంచ్ కేంద్రం తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీ తగ్గించే అంశాన్ని ఎందుకు పరిశీలించడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది.