calender_icon.png 25 December, 2025 | 3:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేను అలర్జీ సమస్యల బారిన పడ్డాను!

25-12-2025 01:22:09 AM

ఢిల్లీ వాయు కాలుష్యమే కారణం: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, డిసెంబర్ 24: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలు ష్యం తీవ్రతపై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి ఆందోళన వ్యక్తం చేశారు. శిలాజ ఇంధనాల వాడకాన్ని గణనీయంగా తగ్గించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. బుధవా రం ఢిల్లీలో మాజీ కేంద్ర సమాచార కమిషనర్ ఉదయ్ మాహూర్కర్ రాసిన పుస్తకావి ష్కరణ కార్యక్రమంలో మంత్రి మాట్లాడు తూ, భారతదే శం ఏటా రూ.22 లక్షల కోట్ల విలువైన శిలా జ ఇంధానాలను దిగుమతి చేసుకుంటోంద ని, ఇది కాలుష్యానికి కీలక కారణమవుతోందని తెలిపారు. ’నేను ఇక్కడ రెండ్రోజులుగా ఉంటున్నాను.

దీంతో ఇన్పెక్షన్ బారి నపడ్డా ను. ఢిల్లీ తీవ్రకాలుష్యం గుప్పి ట్లో ఉంది. నేను రవాణా శాఖ మంత్రిగా ఉన్నాను. రవాణా వల్లే 40 శాతం కాలుష్యం వస్తోంది. పెద్దఎత్తున శిలాజ ఇంధనం వాడకమే ఇందుకు కారణమవుతోంది. మనం ప్రత్యామ్నాయ పరిష్కరాలను అభివృద్ధి చేస్తున్నప్పటికీ వాటిని అందిపుచ్చుకునేందుకు ప్రజలు వెనకాడుతున్నారు’ అని గడ్కరీ అన్నారు. కాలుష్యాన్ని తగ్గించే ఎలక్ట్రిక్, హైడ్రోజన్ ఆధారిత వాహనాలను ప్రోత్సహించాలన్నారు. ఢిల్లీ ఎప్పుడొ చ్చినా రెండు మూడ్రోజులే ఉంటానని, ఎప్పుడెప్పుడు వెళ్లిపోదామా అని ఉంటుందన్నారు.