calender_icon.png 21 November, 2025 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎవరో వచ్చి.. ఏదో చేస్తారని.. ఎదురుచూడలే!

21-11-2025 12:41:48 AM

-రాళ్లు రప్పలతో అధ్వానంగా రోడ్డు..

-పంటపొలాలకు వెళ్లాలంటే అన్నదాతల ఇబ్బందులు...

-గుట్ట దారిని స్వయంగా బాగు చేసుకున్న అన్నదాతలు

తలమడుగు, నవంబర్ 20 (విజయక్రాం తి):  ఎవరో వస్తారని.... ఏదో చేస్తారని... ఎదు రుచూడకుండా అక్కడి రైతులందరూ ఒక్కటై రోడ్డును బాగు చేయించుకున్నారు. తమ పం ట పొలాలకు వెళ్లాలంటే గుట్టను ఎక్కుతూ... రాళ్లు రప్పలు దాటుతూ పడుతున్న ఇబ్బందులను వారే పరిష్కరించుకున్నారు. రాళ్లు రప్పల తో అధ్వాన్నంగా ఉన్న రోడ్డును రైతులే బాగు చేసుకున్న ఓ ఘటన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో చోటుచేసుకుంది.

మం డల కేంద్రానికి కొంత దూరంలోని గుట్టపై పలువురు రైతులకు సంబంధించిన దాదాపు 1,500 ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది. దీంతో అక్కడి రైతులు ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం సాగు చేస్తూ రాళ్ళల్లో రత్నాలు పండి స్తున్నారు. ఐతే ఆరుగాలం కష్టపడి కూలీల కొరతతో పంట సాగుచేయడం, పంటను వన్నె ప్రాణుల నుండి సంరక్షించుకుంటూ వ్యవసాయమే జీవనాధారంగా జీవిస్తున్నారు. కాగా పంట పొలాలకు వెళ్లే రహదారిలో పెద్దపెద్ద బండరాళ్లతో నడవడానికి ప్రతి ఏటా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో గుట్ట దారినీ బాగు చేసుకోవడానికి రైతులంతా ఏకమై శ్రమదానం చేసుకుంటున్నారు. 

అయితే ఈ సంవత్సరం పొలం బాట కింద గుట్ట దారికి ప్రభుత్వం రూ .7 లక్షల రూపాయలు మంజూరు చేసిందని, గత నెల రోజులుగా పనులు చేపడతారని ఎదురుచూస్తున్న పనులు చేపట్టకపోవడంతో రైతులు తల కొంత నగదు జమచేసి జెసిబి ద్వారా పనులు చేపడుతున్నామని రైతు వెంకన్న వాపోయారు. విత్తనాలు నాటిన కాలం నుండి కూలీల కొరత, ఎరువులు మందుల పిచికారి, కోసం ఎన్నో అవస్థలు ఎదుర్కొని పంటను  ఇంటికి తీసుకురావడానికి గుట్ట దారి ద్వారా ఎన్నో అవస్థలు పడుతున్నామన్నారు.

పలుమార్లు ఎడ్ల బండ్లతో రైతులకు ప్రమాదాలు జరిగాయని, ప్రతి ఏడు అధికారులకు నాయకులకు విన్నవించిన ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నో ఏళ్లుగా తాము పడుతున్న శ్రమను ఎవరు గుర్తించడం లేదని,  దారి బాగోలేకపోతే వ్యవసాయాలు వదిలేయాల్సి పరిస్థితి వచ్చిందని అసహనం వ్యక్తం చేశారు. మరో రైతు గంగారెడ్డి మాట్లాడుతూ తమ పెద్దలు కాలం నుండి గుట్టపైన వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. తమకు ఇదే ఆధారమని నాయకులు అధికారులు స్పందించి దారి కోసం శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.