calender_icon.png 21 November, 2025 | 5:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని పరిశీలించిన కలెక్టర్

21-11-2025 12:42:22 AM

ధాన్యం కొనుగోలు కేంద్రం ఆకస్మిక తనిఖీ: కలెక్టర్ కే హైమావతి

నంగునూరు, నవంబర్ 20:మండల పరిధిలోని నర్మేట గ్రామంలో రూ. 300 కోట్లతో నిర్మాణంలో ఉన్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి సంబంధించిన ముందస్తు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె. హైమావతి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో ఈ ఫ్యాక్టరీని ప్రారంభించనున్న నేపథ్యంలో, కలెక్టర్ సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.

బీటీ రోడ్డు,డ్రైనేజీ నిర్మాణాల పార్కింగ్,హెలిప్యాడ్ తదితర పనులను పూర్తి చేయాలని ఇంజనీరింగ్, ఆర్ అండ్ బి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రారంభోత్సవ పనులన్నీ పక్కా ప్రణాళికతో,పగడ్బందీగా సిద్ధం చేయాలని ఆయిల్ ఫ్రైడ్ అధికారులను సూచించారు.అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.

కలెక్టర్ వెంట ఆర్డీఓ సదానందం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సువర్ణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూప రాణి,ఆయిల్ ఫ్రైడ్ మేనేజర్ సుధాకర్ రెడ్డి, ఆయిల్ ఫ్రైడ్ ఇంజనీర్ శ్రీకాంత్ రెడ్డి, ఏవో గీత,ఎమ్మార్వో మాధవి,రెవెన్యూ ఇన్స్పెక్టర్లు లింగం, సూర్య సంబంధిత శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.