calender_icon.png 30 September, 2025 | 7:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గరీబీ హఠావో స్ఫూర్తితో క్యాంటీన్లు

30-09-2025 02:25:06 AM

  1. రూ.5కే ఇందిరమ్మ భోజన భరోసా
  2. పేదల సంక్షేమానికి పెద్ద పీట
  3. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ 
  4. కార్యక్రమంలో పాల్గొన్న నగర మేయర్ విజయలక్ష్మి

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి ):హైదరాబాద్ మహానగరంలో పేదలు, శ్రామికుల ఆకలి తీర్చేందుకు రాష్ర్ట ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ గరీబీ హఠావో నినాద స్ఫూర్తితో, ఆకలి బాధలు లేని హైదరాబాద్ లక్ష్యంగా ఇందిరమ్మ క్యాంటీన్లను పునఃప్రారంభించింది. సోమవారం నగరంలోని మోతినగర్, ఖైరతాబాద్ మింట్ క్యాంపస్‌లలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఈ క్యాంటీన్లను లాంఛనంగా ప్రారంభించారు.

కేవలం రూ.5కే రుచికరమైన అల్పాహారం, రూ.5కే కడుపునిండా భోజనం అందించే ఈ క్యాంటీన్లు అడ్డా కూలీలు, ఆటో డ్రైవర్లు, చిరువ్యాపారులు, నిరుద్యోగులకు ఎంతగానో ప్రయోజ నం చేకూర్చనున్నాయి.ప్రజలకు రూ.5కే ఆహారం అందిస్తున్నప్పటికీ, నాణ్యతలో రాజీ పడకుండా జీహెఎంసీ ఒక్కో అల్పాహారంపై రూ.14, భోజనంపై రూ.24.83 చొప్పు న సబ్సిడీ భరిస్తోంది. దీనివల్ల ప్రతి లబ్ధిదారునికి నెలకు సగటున సుమారు రూ. 3,000 వరకు ఆర్థిక భారం తగ్గనుంది.

ప్రఖ్యాత హరే కృష్ణ హరే రామ ఫౌండేషన్ ఈ క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతలను చూ స్తోంది. ప్రారంభోత్సవం అనంతరం మంత్రి, మేయర్, ఇతర ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు స్వయంగా ఆహారం వడ్డించి, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి భోజనం చేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సంద ర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్నారు.

ఇందిరమ్మ స్ఫూర్తితోనే ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, వడ్డీలేని రుణా లు వంటి పథకాలు అమలు చేస్తున్నాం. ఆర్థిక భారం పడుతున్నా, పేదలకు అండగా నిలవడమే మా లక్ష్యం, అని అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెం చేందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 150 ఇందిరమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేయబోతున్నాం.

మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా, ఈ క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతలను స్వయం సహాయక సంఘాలకు  అప్పగిస్తాం, అని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే దా నం నాగేందర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఈ కేంద్రాలు పేదలకు ఎంతో ఉపయోగపడతాయని కొని యాడారు. ఈ కార్యక్రమానికి జీహెఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ హాజరయ్యారు.