10-11-2025 01:02:30 AM
ఒకరు మృతి..
ఆలేరు, నవంబర్ 9 (విజయ క్రాంతి): ఆలేరు రఘునాథపురం ఫ్లుఓవర్ అయినా రఘునాథపురం నుండి ఆలేరుకు అతి వేగంగా వస్తున్న కారు నెం. టి ఎన్ 30 సి యు 9604 కారు టి ఎస్ 30సి 4629 బైక్ పై వస్తున్న ఎర్ర ఉదయ్ వయసు 22 సంవత్సరాలును డి కొట్టడంతో ఫ్లుఓవర్ పై నుండి మున్సిపాలిటి ఆఫీస్ కు వెళ్లే రోడ్డు పై పడడంతో అక్కడికక్కడే మరణించాడు.
వివరాల లోకి వెళితే ఆలేరు ఎస్సీ కాలనీకి చెందిన మృతుడి తల్లిదండ్రులు ఎర్ర కిష్టయ్య మాతమ్మలకు రెండో కుమారుడు ఎర్ర ఉదయ్ రోజు వాళ్ల అమ్మ ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచే స్తుం ది అందులో భాగంగా రోజు ఆమెను ఉద యం 5 గంటలకు ఆఫీస్ వద్ద వదిలి తిరిగి వెళ్లే క్రమంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. హరి రామకృష్ణ తండ్రి హరి తమిళనాడుకు చెందిన సుమారు 40 సం. లు తన పిల్లనిచ్చిన మా మగారైన ఎలగందుల సుభాష్ రఘునాథపురం గ్రామముకు వచ్చి తిరిగి వెళుతున్న క్రమంలో సంఘటన జరిగింది.