10-11-2025 01:04:17 AM
విజయక్రాంతి కథనంతో సమస్య తీరిందంటూ గ్రామస్థుల కృతజ్ఞతలు
నూతనకల్, నవంబర్ 9: మండల పరిధిలోని మిర్యాల గ్రామంలో గల పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. ‘విజయక్రాంతి’ దినపత్రికలో ఆగస్టు 6న ప్రచురితమైన “సారు కనికరించండి కాస్త” అనే శీర్షికతో ప్రచురితమైన కదనానికి అధికారులు వెంటనే స్పం దించారు.
ఫలితంగా, గ్రామ ప్రభుత్వ పాఠశాలలో అత్యవసరమైన ప్రహరీ నిర్మా ణం విజయవంతంగా పూర్తి చేశారు.? ప్రహరీ లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాల స్థలం అన్యాక్రాంతం అవుతోందని, తరగతులు జరుగుతున్న సమయంలో బయటి వ్యక్తుల రాకపోకలు, పశువుల సంచారం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వెలుగు లోకి తెచ్చింది. దీంతో వెంటనే ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించారు. నిధులు మంజూరు చేసి, యుద్ధప్రాతిపదికన ప్రహరీ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఆదివారం నాటికి ప్రహరీ నిర్మాణం పూర్తి కావడంతో పాఠశాల ఆవరణ సురక్షితంగా మారింది. సమస్యను వెలుగులోకి తెచ్చిన విజయ క్రాంతి పత్రికకు, తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించిన అధికారులకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.