24-05-2025 12:23:38 AM
ఒకరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు
యాదాద్రి భువనగిరి మే 23 ( విజయ క్రాంతి ): యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ బ్రిడ్జి పై నుండి కారు బోల్తా పడడంతో ఒకరు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాల య్యాయి. మోహినాబాద్ కు చెందిన రామస్వామి కుటుంబ సభ్యులు మారుతి 800 కారులో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని తిరిగి భువనగిరి మీదుగా వెళుతుండగా బీబీనగర్ బ్రిడ్జిపై అదుపుతప్పి బ్రిడ్జి కింద వాగులో పడిపోయింది.
కారు నుజ్జునుజ్జయింది.ఈ నేపథ్యంలో కారులో నలుగురు పెద్దలు, నలుగురు చిన్నపిల్లలు ప్రయాణిస్తున్నారు. వారందరికీ తీవ్ర గాయాలు కాగా రామస్వామి అనే వ్యక్తి బోనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించిన అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందాడని పోలీసులు తెలిపారు. గాయపడ్డ వారందరినీ భువనగిరి ఏరియా ఆసుపత్రిలో చేర్పించి సీరియస్‌గా ఉన్నవారిని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. బీబీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.