05-01-2026 12:14:00 AM
నంగునూరు, జనవరి 4: సిద్దిపేట జిల్లా నంగునూరు మండల పరిధిలోని సీతారాంపల్లి వద్ద ఆదివారం కారు ప్రమాదానికి గురైంది. చేర్యాల నుండి కొహెడ మండలం పెద్ద సముద్రాల గ్రామానికి కారులో వెళ్తుండగా రోడ్డుపై కుక్క అడ్డు రావడంతో వాహనం అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, ప్రయాణికులిద్దరూ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే బాధితులను కారులో నుండి బయటకు తీసి, వాహనాన్ని రోడ్డు పక్కకు తొలగించారు.