calender_icon.png 7 January, 2026 | 3:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్యకర్తలకు అండగా ఉంటా ..

05-01-2026 12:13:33 AM

మృతురాలి కుటుంబానికి పరామర్శించిన డా. సంపత్ 

తాండూరు, జనవరి 4, (విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని వికారాబాద్ జిల్లా తాండూరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బి వి జి ఫౌండేషన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ వైద్యులు సంపత్ కుమార్ అన్నారు.

ఆదివారం పట్టణ పరిధిలోని ఇంద్రనగర్ 5వ వార్డ్  కు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త షేక్ ఖాసిం తల్లి బిస్మిల్లా బేగం అకాల మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న డాక్టర్ సంపత్ కుమార్ వారి నివాసానికి  వెళ్లి కుటుంబ సభ్యులకు పరామర్శించి  మనోధైర్యాన్ని కల్పిస్తూ    మాతృమూర్తి యొక్క ఆత్మకు శాంతి కలగాలని ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని ఎవరు కూడా అధైర్య పడకూడదని అన్నారు.