08-01-2026 12:46:03 AM
భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితికి మంత్రి అడ్లూరి, మాజీ కేంద్రమంత్రి సముద్రాల ప్రశంస
హైదరాబాద్, జనవరి 7 (విజయక్రాంతి): శబరిమలలో అయ్యప్పస్వాముల ఆకలి దప్పికను తీరుస్తున్న ఉస్మాన్ గంజ్ శ్రీ భాగ్యనగర్ అయ్యప్ప సేవ సమితి సేవలు ఆదర్శప్రాయమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల చార్యులు పేర్కొన్నారు. బుధవారం ఉస్మాన్‌గంజ్‌లోని బాస్ సంస్థ నుంచి నిత్యావసర సరుకులతో కూడిన లారీ కేరళకు తర లివెళ్లింది. కేరళలోని నిలకల్ రోడ్డు ప్రధాన మార్గంలో అయ్యప్ప స్వాముల కోసం అన్నదాన ప్రసాద వితరణ కేంద్రాన్ని మంత్రి లక్ష్మణ్, వేణుగోపాల చారి, ప్రముఖ వ్యాపారవేత్త బి రాజ్ కుమార్‌గౌడ్ హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ మాట్లాడుతూ.. శబరిలో ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించడానికి తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాదిమంది స్వాములు తరలివస్తుంటారని, అ లాంటి స్వాముల ఆకలి, దప్పికను తీర్చడానికి గత కొన్ని సంవత్సరాలుగా బాస్ సంస్థ ఈ సేవా కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. కార్యక్రమంలో బాస్ అధ్యక్షుడు మేడిశెట్టి రాకేష్, ప్రధాన కార్యదర్శి భద్రేశ్వర్, కోశాధికారి సీఏ అనిల్ నాయర్, బాస్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ అన్నదాన కార్యక్రమం జనవరి 14 వరకు కొనసాగుతుంది. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి నిర్విరామంగా 20 వేల మందికి పైగా అయ్యప్ప స్వాములకు ఆకలి తీర్చడానికి సిద్ధంగా ఉన్నామని మేడిశెట్టి రాకేష్ తెలిపారు.