14-09-2025 12:57:00 AM
కొంతమంది కీడాకారులు గాయాల తర్వాత మరింత బలంగా, విశ్వాసంతో మైదానంలోకి ఎలా తిరిగి వస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? వారి రహస్యం స్పోర్ట్స్ మెడిసిన్‌లో ఉంది. ఇది గాయాల్ని మాత్రమే నయం చేయడమే కాకుండా ఆటలో అద్భుత ప్రదర్శనకు దోహదం చేస్తుంది. భవిష్యత్తులోని గాయాలను నివారిస్తుంది. హైదరాబాద్ స్టార్ హాస్పిటల్స్‌కు చెందిన సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జరీ, ఆర్థ్రోస్కోపీ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ అజయ్ సింగ్ ఠాకూర్ ఈ అంశాలకు చెందిన వివరాలను విజయక్రాంతి పాఠకులతో పంచుకున్నారు.
ఇప్పుడీ వైద్య విభాగం కేవలం ప్రొఫెషనల్ ఆటగాళ్లకే పరిమితం కాలేదు. వీకెండ్ క్రికెట్ ఆడేవారైనా, మరథాన్‌లలో పాల్గొనేవారైనా, రోజూ జిమ్‌కు వెళ్లేవారైనా, స్పోర్ట్స్ మెడిసిన్ మీ రికవరీని వేగవంతం చేసి, గాయాలను నివారించి, మీ యాక్టివ్ జీవితాన్ని పొడిగిస్తుంది. ఈ విభాగం వైద్యులు, ఫిజియోథెరపిస్టులు, న్యూట్రిషనిస్టులు, ట్రైనర్లు కలిసి ప్రతి ఆటగాడికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తారు.
స్పోర్ట్స్ మెడిసిన్ వ్యక్తిగత వైద్య పద్ధతులు, ఆధునిక డయాగ్నస్టిక్స్, సంపూర్ణ ఆరోగ్య దృక్పథంపై దృష్టి పెడుతుంది. గాయాలను మాత్రమే నయం చేయడం కాకుండా, శక్తిని పెంచే వ్యాయామాలు, పోషకాహార మార్గదర్శకాలు, మానసిక ఆరోగ్య సహాయం, రికవరీ టెక్నిక్స్ ద్వారా ప్రదర్శనను మెరుగుపరుస్తుంది.
సాధారణ గాయాలు, నిర్వహణ
గాయాల రకాలు: యాంకిల్ స్ప్రెయిన్, హ్యామ్ట్సింగ్ స్ట్రెయిన్, టెన్నిస్ ఎల్బో వంటి ఓవర్యూజ్ గాయాలు
స్పోర్ట్స్ మెడిసిన్ మూలకారణాన్ని గుర్తించి చికిత్స చేస్తుంది, కేవలం లక్షణాల్ని తగ్గించదు.
పునరావాస దశలు రికవరీలో ప్రధాన దశలు:
విశ్రాంతి, నొప్పి నియంత్రణ
కదలికలను పునరుద్ధరించడం
కండరాల బలం పెంచడం
ఆటకు ప్రత్యేకమైన శిక్షణ
లక్ష్యం: గాయం నయం చేయడమే కాకుండా, మరింత ధైర్యంగా మైదానంలోకి తిరిగి తీసుకురావడం.
శస్త్రచికిత్స అవసరం లేని పద్ధతులు
చాలా గాయాలకు ఆపరేషన్ అవసరం లేదు. ఫిజియోథెరపీ, పీఆర్‌పీ లేదా కార్టికోస్టెరాయిడ్ ఇంజెక్షన్లు, బ్రేసింగ్, ఆర్థోటిక్స్ వంటి చికిత్సలు వేగంగా, సురక్షితంగా రికవరీకి సహాయపడతాయి.
గాయాల నివారణ
స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణులు సరైన శిక్షణ పద్ధతులు, కండిషనింగ్, విశ్రాంతి విధానాలను నేర్పిస్తారు. టెక్నాలజీ ద్వారా బలహీనతలను ముందే గుర్తించి సరిదిద్దుతారు.
మానసిక దృఢత్వం
గాయం నుంచి కోలుకోవడం శారీరకమే కాదు, మానసికంగానూ కష్టమే. స్పోర్ట్స్ మెడిసిన్‌లో మానసిక మద్దతు కూడా ఉంటుంది. ఇది ఆటగాడికి ప్రేరణనిచ్చి రికవరీ సమయంలో ఫోకస్‌ను కాపాడుతుంది.
నిపుణులను ఎప్పుడు సంప్రదించాలి?
విశ్రాంతితో తగ్గని నొప్పి
తరచూ వచ్చే గాయాలు
ఆటలో ప్రదర్శనలో పరిమితులు ఉంటే వెంటనే స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడిని సంప్రదించాలి.
నిపుణుల సూచన
స్పోర్ట్స్ మెడిసిన్ ప్రతిరోజూ ఆడే ఆటగాళ్ల జీవితాన్ని మార్చేస్తోంది. వైద్య నైపుణ్యం, టెక్నాలజీ, వ్యక్తిగత సంరక్షణతో గాయాల నుంచి వేగంగా కోలుకోవడమే కాకుండా మీ ఆటను కొత్తస్థాయికి తీసుకెళ్తుంది. స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్‌లో డాక్టర్ అజయ్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలోని మా బృందం, ఆధునిక పద్ధతులతో ప్రత్యేక చికిత్స అందిస్తోంది.
మీ రికవరీ, ప్రదర్శన లక్ష్యాల కోసం ఈరోజే స్టార్ హాస్పిటల్లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి.