calender_icon.png 26 January, 2026 | 5:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏహెచ్‌పీఐ గ్లోబల్ కాన్‌క్లేవ్‌లో కేర్‌కు జాతీయ అవార్డులు

26-01-2026 02:54:08 AM

నాణ్యత, రోగి భద్రత, రోగి కేంద్రిత సేవల్లో మరోసారి హాస్పిటల్ తనదైన ముద్ర

హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 25: అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఇండియా (ఏహెచ్‌పీఐ) ముంబైలో నిర్వహించిన రెండు రోజుల ఏహెచ్‌పీఐ గ్లోబల్ కాన్‌క్లేవ్ 2026లో కేర్ హాస్పిటల్‌కు జాతీయ స్థాయిలో అనేక అవార్డులు లభించాయి. జాతీయ సంక్షేమానికి ఆస్పత్రులు బలమైన స్థంభాలుగా మారాలనే అంశంతో జరిగిన ఈ కాన్‌క్లేవ్‌లో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆస్పత్రులు, వైద్య నిపుణులు పాల్గొని నాణ్యత, రోగి భద్రత, రోగి కేంద్రిత సేవలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆస్పత్రులను గుర్తించి సత్కరించారు.

ఈ అవార్డులు కేర్ హాస్పిటల్స్ రోగుల భద్రత, నర్సింగ్ సేవలు, రోగులకు మెరుగైన అనుభవం కల్పించడంలో నిరంతరం పాటిస్తున్న ఉన్నత ప్రమాణాలకు నిదర్శనంగా నిలిచాయి.ఏహెచ్‌పీఐ అవార్డ్స్ 2026లో కేర్ హాస్పిటల్స్, బం జారాహిల్స్, భువనేశ్వర్ యూనిట్లకు ఎక్సలెన్స్ ఇన్ క్వాలిటీ  బియాండ్ అక్రెడిటేషన్ అవార్డు లు లభించాయి. అదేవిధంగా నాణ్యతతో పా టు రోగులను కేంద్రంగా చేసుకుని అందిస్తున్న సేవలను గుర్తిస్తూ కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్‌కు ప్రత్యేకంగా పేషెంట్-సెంట్రిక్ హాస్పిట ల్ అవార్డు కూడా దక్కింది.

నర్సింగ్ సేవలలో ఉన్నత ప్రమాణాలను పాటిస్తూ రోగులకు మెరుగైన సంరక్షణ అందిస్తున్నందుకు కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీకు ఎక్సలెన్స్ ఇన్ నర్సింగ్ ప్రాక్టీసెస్ విభాగంలో ‘ఏహెచ్‌పీఐ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ హెల్త్‌కేర్’ ప్రదానం చేశారు. నాణ్యమైన వైద్య సేవల అందించడం లో నర్సుల కీలక పాత్రను ఈ అవార్డు స్పష్టం గా ప్రతిబింబించింది.ఈ కాన్‌క్లేవ్,అవార్డులపై ఏహెచ్‌పీఐ జాతీయ అధ్యక్షుడు, కిమ్స్‌హెల్త్ చైర్మన్, క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ క్లినికల్ అడ్వైజర్ డాక్టర్ ఎంఐసహదుల్లా మాట్లాడుతూ, దేశ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తున్న ఆస్పతులనుగుర్తించేందుకు ఏహెచ్‌పీఐ గ్లోబల్ కాన్‌క్లేవ్ ఒక ముఖ్యమైన వేదికగా మారిందన్నారు.