calender_icon.png 12 December, 2025 | 1:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెట్ నిబంధన రద్దు చేయాలి

12-12-2025 01:27:39 AM

  1. టీఆర్టీఎఫ్, ఏపీటీఎఫ్ నేతలు

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉపాధ్యాయుల ధర్నా   

హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ నిబంధ నను రద్దు చేయాలని అఖిలభారత విద్యాసంఘాల సమాఖ్య, తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్), ఏపీటీఎఫ్ డిమాండ్ చేశాయి. ఈమేరకు గురువారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ధర్నాలో వేలాది మంది ఉపాధ్యాయులు పాల్గొన్నా రు. తెలంగాణ రాష్ర్ట టీచర్స్ ఫెడరేషన్ రాష్ర్ట అధ్యక్షుడు కటకం రమేష్ మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం ప్రకారం టెట్ నిబంధన అమల్లోకి రాకముందు సర్వీసులో చేరిన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయిం పు ఉందని గుర్తు చేశారు. 

కేంద్ర ప్రభుత్వం 2017లో పార్లమెంట్‌లో చట్ట సవరణ చేసి, ఇన్ సర్వీస్ టీచర్లతో సహా అందరికీ టెట్‌ను తప్పనిసరి చేయడాన్ని తీవ్ర అన్యాయంగా పేర్కొన్నారు. 2017లో చేసిన ఈ సవరణను ఉద్దేశిస్తూ, ఇది ‘ఆట మధ్యలో నిబంధన మార్చడం’ లాంటిదన్నారు. ఈ సవరణ వల్లే ఇన్ సర్వీస్ టీచర్లకు ఈ సమస్య మొదలైందని స్పష్టం చేశారు.   ఈ పార్లమెంటు సమావేశాల్లోనే 2017లో చేసిన సవరణను రద్దు చేయాలని ఉపాధ్యాయులు,  ఉపాధ్యాయ సంఘాల నాయకులు కేంద్ర ప్రభు త్వాన్ని డిమాండ్ చేశాయి.