calender_icon.png 2 October, 2025 | 8:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హీరోయిన్ డింపుల్ హయతిపై కేసు

02-10-2025 02:02:21 AM

  1. జీతం అడిగిన పనిమనిషిపై దాడి
  2. నగ్న వీడియోలు తీసేందుకూ యత్నం?
  3. ఫిలింనగర్ పీఎస్‌లో ఒడిశాకు చెందిన పనిమనిషి ఫిర్యాదు
  4. డింపుల్ హయతితోపాటు ఆమె భర్తపైనా కేసు నమోదు

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 1 (విజయక్రాంతి): సినిమాల కన్నా వివాదాలతోనే ఎక్కు వగా వార్తల్లో నిలిచే టాలీవుడ్ నటి డింపుల్ హయతి మరోసారి చిక్కు ల్లో పడింది. జీతం అడిగినందుకు తీవ్రంగా దూషి స్తూ, తనపై దాడి చేశారని ఇంట్లో పనిచేసే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీసులు డింపుల్ హయతితో పాటు ఆమె భర్తపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.

గద్దలకొండ గణేష్ చిత్రంలోని జర్రా జర్రా పాటతో గుర్తింపు తెచ్చుకున్న డింపుల్.. గతంలో ఓ ఐపీఎస్ అధికారితో గొడవపడి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిం దే. తాజా గా, తన పెంపుడు కుక్కల సంరక్షణ కోసం ఒడిశా నుంచి ఇద్దరు యువతులను పనిలో పెట్టుకున్న డింపుల్, వారికి జీతాలు ఇవ్వకుండా వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం..

“జీతం అడిగినప్పుడు డింపుల్, ఆమె భర్త అత్యంత దారుణంగా ప్రవర్తించారు. మీరు నా చెప్పులంత విలువ చేయరు. మీరెంత? మీ బతుకెంత?” అంటూ దూషించారని, ఇంట్లో నుంచి బయటకు గెంటేశారని బాధితురాలు ఆరోపించిం ది. అంతేకాకుండా, “నా భర్త లాయర్, నన్నెవరూ ఏమీ చేయలేరు” అంటూ డింపుల్ బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒకరోజు పెంపుడు కుక్క అరిచిందన్న కారణంతో తనను నగ్నంగా చేసి కొట్టడానికి ప్రయత్నించారని, ఆ సమయంలో తన నగ్న వీడియోలు తీసేందుకు కూడా ప్రయత్నించారని బాధితురాలు చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.