calender_icon.png 2 October, 2025 | 6:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇద్దరు ఎమ్మెల్యేల వాదనలు పూర్తి

02-10-2025 02:00:23 AM

మరో ఇద్దరి వాదనలు 4వ తేదీకి వాయిదా

హైదరాబాద్, అక్టోబర్ 1(విజయక్రాంతి): పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల ఫిర్యాదుకు  సంబంధించి తెలంగాణ స్పీకర్ సమక్షంలో బుధవారం ఇద్దరు ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, ప్రకాష్‌గౌడ్ విచారణ జరిగింది.

మరో ఇద్దరు ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిల విచారణను స్పీకర్ వాయిదా వేశారు. నాలుగో తేదీన వీరిని విచారించనున్నా రు.  పార్టీ ఫిరాయింపులపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తరఫున ఇద్దరు న్యాయవాదులు హాజరై..

ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, ప్రకాష్‌గౌడ్‌ను క్రాస్ ఎగ్జామినేషన్‌లో అనేక ప్రశ్నలు వేశారు. పార్టీ మారినట్లు అనేక ఆధారాలున్నాయని, అనర్హత వేటు పడాల్సిందేనని న్యాయవాదులు వాదించారు.

అయితే తాము పార్టీ మారలేదని, బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని  ఎమ్మెల్యేలు సమాధానమిచ్చారు. తమ నియోజక వర్గాల అభివృద్ధికే సీఎం రేవంత్‌రెడ్డిని కలిశామని చెప్పారు. స్పీకర్ ప్రసాద్‌కుమార్ ఇరు వర్గాల వాదనలు విన్నా రు. వీరిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.