calender_icon.png 18 May, 2025 | 3:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ఢీకొని మహిళా మృతి

17-05-2025 09:50:46 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం గంగాయిపేట గ్రామ శివారులో ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. ఖానాపూర్ ఎస్సై రాహుల్ గైక్వాడ్ వివరాల ప్రకారం... శుక్రవారం మెస్రం స్వప్న(28) అనే మహిళ గంగాయపేట శివారు తోట భీమేష్ ఇటుక బట్టీలో పనిచేస్తుండగా ఇటుక లోడ్ చేసిన ట్రాక్టర్ మహిళలను గమనించకుండా రివర్స్ చేయగా ఆ మహిళ ట్రాక్టర్ కిందపడి మరణించిందని మృతురాలికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నట్లు తెలిపారు. ఆమె అన్న కుడిమెట్ట గంగారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపారు.