14-09-2025 12:09:46 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): ప్రజాస్వామ్య ప్రక్రియలో కీలకమైన ఓటరు నమోదు కార్యక్రమంపై జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వి కర్ణన్ కీలక ప్రకటన చేశారు. జూలై 1, 2025 నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన జూబ్లిహిల్స్ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చా రు.
జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ప్రస్తుతం ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్ర మం 2025ను చేపట్టిందని కమిషనర్ కర్ణన్ వెల్లడించారు. ఓటరు నమోదుకు ఈ నెల 17వ తేదీ లోగా అవకాశం ఉందని, అర్హులందరూ ఈ గడువులోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.