calender_icon.png 17 November, 2025 | 2:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పెషల్ లోక్ అదాలత్ ద్వారా 5,838 కేసులు పరిస్కారం: పోలీస్ కమిషనర్

17-11-2025 12:42:47 AM

ఖమ్మం టౌన్, నవంబర్ 16 (విజయ క్రాంతి): జిల్లావ్యాప్తంగా ప్రత్యేక లోక్ అదాలత్ కు విశేష స్పందన లభించిందని, వీటి ద్వారా 5838 కేసులు పరిష్కారమయ్యాయని, సైబర్ క్రైమ్ కేసుల్లో 92 లక్షలకు పైగా రిఫండ్ మొత్తాన్ని బాధితులకు అంద జేశారని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదివారం ఒక ప్రకటనలో  తెలిపారు.

లోక్ అదాలత్ ద్వారా రాజీకి అవకాశం ఉండి పరిష్కరించిన 5838 కేసు ల్లో ఎఫ్‌ఐఆర్ కేసులు -605, ఈ పెట్టి కేసులు -2583, డ్రంకెన్ అండ్ డ్రైవ్ కేసులు - 2650, సైబర్ కేసులు -195  పరిష్కరించడం ద్వారా 92,45,636/- రూపాయలు బాధితులకు అందజేశారని తెలిపారు.

రాజీ మార్గం రాజ మార్గమని, లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాలకు న్యాయం జరుగుతుందని అవగాహన కల్పించి కేసుల పరిష్కారానికి కృషి చేసిన పోలీస్ అధికారులను, సిబ్బంది పోలీస్ కమిషనర్ అభినందించారు. అదేవిధంగా లోక్ అదాలత్ సద్వినియోగం సహకరించిన న్యాయవాదులు, కక్షిదారులు, న్యాయసేవాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.