calender_icon.png 17 November, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ హాస్టళ్లలో సమస్యలను పరిష్కరించాలి

17-11-2025 12:41:11 AM

ములకలపల్లి, నవంబర్ 16,(విజయక్రాంతి):ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యా ర్దులకు మోను ప్రకారం భోజనం పెట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ మండల నాయకులు ముదిగొండ ప్రశాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ములకలపల్లి లోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సం దర్శించి విద్యార్థులను సమస్యలు అడిగి తె లుసుకొని విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రభుత్వ హాస్టళ్లలో నెలకొన్న విద్యార్థుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హాస్టల్స్ ను ఎప్పటికప్పుడు జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షించాలని అన్నారు.

హాస్టల్ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చెపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగేలా ప్రభుత్వ వసతి గృహాలను అభివృద్ధి పరచాలని హా స్టల్ వార్డెన్లు నిరంతరం విద్యార్థులకు అందుబాటులో ఉండాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల నాయకులు సంజయ్,రాము,సాగర్,సాయి,వినిత్, తదితరులు పాల్గొన్నారు.