16-12-2025 12:45:49 AM
బూర్గంపాడు,డిసెంబర్15,(విజయక్రాంతి):స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయం రేటింగ్ వెరిఫికేషన్ లో భాగంగా మండలంలోని మోరంపల్లి బంజర జిల్లా ఉన్నత పాఠశాల,ఎంపీపిఎస్ అంజనాపురం,ఎంపీపిఎస్ బుడ్డగూడెం,భద్రాచలం పేపర్ బోర్డు పాఠశాలలను రాష్ట్ర స్థాయి బృందం పరిశీలించారు.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) లో విద్యార్థుల గణితం, తెలుగు సామర్థ్యాలతో పాటు, కంప్యూటర్ లాగిన్ విధానం, విద్యార్థులకు తెలుగు పదాలు చదివించారు. ఏఐ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ ఎన్. సతీష్ కుమార్,మండల ఎంఐఎస్ కిషన్ ,సిఆర్పీ లు శ్రీను, నరేష్, ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.