calender_icon.png 6 May, 2025 | 6:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుల గణన కాంగ్రెస్ పేటెంట్

06-05-2025 12:39:57 AM

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 

హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): కుల గణన అనేది కాంగ్రెస్ పేటెంట్ అని, బీసీల గురించి ఆలోచించేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచనల మేరకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుల గణన చేసి ఎవరి జానాభా ఎంతో లెక్కలు తేల్చారని తెలిపారు.

సోమవారం సీఎల్పీ కార్యాలయం లో ఆది శ్రీనివాస్ మాట్లాడారు. దేశంలో పేద ల కోసం పథకాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని తెలిపారు. తెలంగాణలో బీసీ లు 56.36 శాతం ఉన్నారని, వారికి 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రాన్ని కోరామన్నారు. తెలంగాణలో కుల గణన విజయవం తం కావడంతోనే బీజేపీ కళ్లు తెరిచిందన్నారు.

జన గణనలో కుల గణన చేస్తామన్న బీజేపీలో స్వార్థం కనిపిస్తోందని మండిపడ్డారు. కుల సర్వేకి, కుల గణనకు తేడా ఏంటో కేంద్ర మం త్రి కిషన్‌రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు.  బీసీల పట్ల బీజేపీకి చిత్తశుద్ది లేదని, బీసీల కోసం కాంగ్రెస్ ఢిల్లీలో దీక్ష చేస్తే బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ఎందుకు హాజరుకాలేదని నిలదీ శారు. గుజరాత్  సహా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలను బీసీల్లో చేర్చిన అంశంపై బండి సంజయ్ సమాధానమివ్వాలని కోరారు.