06-05-2025 12:38:17 AM
మాజీ మంత్రి హారీశ్‌రావు
హైదరాబాద్, మే5 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేకే బీఆర్‌ఎస్‌పై బురద చల్లుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. కమాండ్ కంట్రోల్ వేదికగా సోమవారం సీఎం చేసిన వ్యాఖ్యలపై ఆయన ‘ఎక్స్’ ద్వారా స్పందించారు. ఇప్పటికైనా తమపై బూటకపు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. ఇకపై తాము ఉపేక్షించమని చట్టపరమైన చర్యలకు పూనుకుంటామని హెచ్చరించారు.