calender_icon.png 6 May, 2025 | 5:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ ప్రవీణ్‌కు అత్యున్నత పురస్కారం

06-05-2025 12:42:05 AM

సీఎం చేతుల మీదుగా రియల్ పోలీస్ అవార్డు

భద్రాద్రికొత్తగూడెం, మే 5 ( విజయ క్రాంతి)  కొత్తగూడెం టాస్క్ఫోర్స్ - సీసీఎస్ ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న, జలకం ప్రవీ ణ్ సోమవారం హైదరాబాద్ పోలీస్ కమాం డ్ కంట్రోల్ రూమ్లో జరిగిన  కార్యక్రమం లో, సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ పోలీస్ రియల్ హీరోస్ పురస్కా రం అందుకున్నారు. ప్రజల కోసం ప్రాణా లు సైతం పణంగా పెట్టి 24 గంటలు కష్టపడుతున్న పోలీసుల సేవలను గుర్తించి వారికి జీ తెలుగు న్యూస్ ఈ అవార్డులను అందిస్తోంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి విశేష సేవలు అందించిన పోలీసులకు అవార్డులను ప్రదా నం చేశారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రవీణ్ కుమార్ ను అభినందించారు.

ఎస్‌ఐ ప్రవీణ్ మాట్లాడు తూ ఈ పురస్కారం మరింత బాధ్యతను పెం చిందని, విధి నిర్వహణలో తనకు సహకరించిన జిల్లా అధికారులు, సహచర బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి కె. రామకృష్ణారావుతో పాటు స్పెషల్ ఛీప్ సెక్రటరీ రవిగుప్తా, డీజీపీ డాక్టర్ జితేందర్, హైదరాబాద్ నగర కొత్వాల్ సీవీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.