30-10-2025 12:15:33 AM
- 3 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా
- గద్వాల రూరల్ పోలీస్ స్టేషన్ పక్కనే ఖాళీ స్థలం కబ్జా
- తన వెంచర్ ముసుగులో హక్కు పత్రం లేకపోయినా బదలాయింపు
- విషయం తెలిసిన నిమ్మకు నీరెత్తి నట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారా...??
- దీని వెనక ప్రజాప్రతినిధుల హస్తం ఉన్నదా ?
- అధికారులు స్పందించాలన్న పట్టణ ప్రజలు
గద్వాల అక్టోబర్ 29 : గద్వాల జిల్లా ఏర్పాటు తర్వాత భూములకు డిమాండ్ పెరిగింది. అందులో కలెక్టరేట్ నుండి వీరాపురం వరకు కర్నూల్ రోడ్డుకు ఒక ఫ్లాట్ విలువ కోట్లల్లో పలుకుతుంది. ఈ సమయంలోనే ఒక్క ఫ్లాటు కబ్జా చేసిన కోట్లల్లో లాభం పొందవచ్చని భావించాడు ఒక నాయకుడు . తన భాగస్వామ్యంలో గద్వాల రూరల్ పోలీస్ స్టేషన్ సమీపం లో వేసిన వెంచర్లో ఒక ప్లాట్ ను ఎల్ ఆర్ ఎస్ చేయించుకొని వారి పేరు మీద మార్చుకునే క్రమంలో ఆ ఫ్లాట్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంపై ఆయన కన్ను పడింది . అంతే ఒక ప్రజా ప్రతిని ధి అండతో మునిసిపాలిటీ లో చకచకా భవన నిర్మాణ అనుమతులు పొంది దాని ముసుగులో ప్రభుత్వ స్థలంలోని 100 0 గజాల స్థలం కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ప్రస్తు తం దాని విలువ మూడు కోట్లు పైనే ఉంటుందని అంచనా.
జమ్ములమ్మ కరకట్ట నిర్మాణం కోసం
గద్వాల పట్టణ సమీపంలో 1986 లో జమ్ములమ్మ రిజర్వాయర్ నిర్మాణ సమయంలో ఆలయం చుట్టూ కరకట్ట ని ర్మించారు. దీని నిర్మాణానికి మట్టి అవసరం కాగా ఇరిగేషన్ అధికారులు అప్పట్లో సర్వేనెంబర్ 49 లో రెండు ఎకరాలు భూమిని తీసుకున్నారు. అదే విధంగా దాని పక్కనే ఉన్న సర్వేనెంబర్ 48 లో గద్వాల_ కర్నూల్ రోడ్డు విస్తరణలో భాగంగా మరో 25 గుంటల భూమిని సేకరించారు. మరో మూడు గుంటలు ఎండోమెంట్ పేరుపై ఉంది. ఇక్కడ వరకు బాగానే ఉంది.
కాలక్రమంలో పట్టణం విస్తరించి అభివృద్ధి చెందడంతో అతని కళ్ళు ఖాళీగా ఉన్న ఆ ప్రభుత్వం భూమిపై పడిం ది గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ సమయంలో దానిని నిర్మిత కేంద్రంగా నిర్మించుకుంది .అప్పట్లో మోడల్ ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకొని దా నిని హౌసింగ్ కార్యాలయంగా ఉపయోగించుకున్నారు. ఇప్పు డు ఆ స్థలం ఖాళీగా ఉండటంతో అందులో కొంత భా గం ఎక్సైజ్ కార్యాలయానికి, మరికొంత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ నిర్మాణానికి ఉపయోగించారు . ఇంకా కొంత మి గులు భూమి ఉంది ఇప్పుడు అందరి కళ్ళు ఆ భూమ్మీద పడ్డాయి.
భార్య పేరుపై రిజిస్ట్రేషన్
ఈ ప్రభుత్వ భూమి పక్కనే కొందరు వ్యక్తులు వెంచర్ వేశారు. దీనికి అనుమతి లేదని సమాచారం అయితే ఈ ఫ్లాట్ లన్ని దాదాపు అమ్ముడుపోయాయి. మిగిలిపోయిన ప్లాట్లను వెంచర్ వేసిన యజమానులు పంచుకున్నారు. వీటిని తిరిగి వారిపై రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో అందులోని ఒకరి కన్ను వెంచర్ పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిపై పడింది. వెంచ ర్లో మిగిలిపోయిన ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో ఈ ప్రభుత్వ భూమిలోని వెయ్యి గజాల భూమిని కూడా 2023లో భార్య పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారు .
దీని విలువ మూడు కోట్లకు పైగానే ఉంటుంది ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్ చేయడానికి పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి .అయితే అంతకుముందే 2021 లో గద్వాల మునిసిపాలిటీలో వీటిపై బిల్డింగ్ అనుమతులు తీసుకున్నారు. ఈ పత్రాలు కూడా సృష్టించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సర్వేనెంబర్ 48, 49 లోని ప్రభుత్వ భూమికి సంబంధించి డాక్యుమెంట్ లేకుండా ఎలా అనుమతి ఇస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. విలువైన భూములను అక్రమార్కులు ఆక్రమిస్తున్న అధికారులు చూసి చూడనట్లుగా వదిలేయడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
కొసమెరుపు
అక్రమార్కులు వేసిన వెంచర్లో వేసిన మ్యాప్ లో చివరి ఫ్లాట్ నెంబర్ 95 మరి మిగిలిన ఫ్లాట్లు నెంబర్లు చూయించకుండానే డైరెక్ట్ గా ఫ్లాట్ నెంబర్ 102 నీ చూయించి సబ్ రిజిస్టర్ ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తాడు. మున్సిపాలిటీలో ఎలాంటి పత్రాలు చూడకుండా ఇంటి నిర్మాణం కోసం ఏ విధంగా పర్మిషన్ ఇస్తారు కిందిస్థాయి అధికారులకి తెలిసే ఈ వ్యవహారం చేశారా ఈ విధంగా చేసినట్లయితే లక్షల రూపాయలు చేతులు మారినట్లే కదా అని ప్రజలు పెదవి విరుస్తున్నారు . ఏది ఏమైనాప్పటికీ ఇప్పటికైనా అధికారులు స్పందించి కబ్జాకోరుల నుండి ఈ వెయ్యి గజాల స్థలాన్ని రద్దు చేయించి ప్రభుత్వ పరం చేయించినట్లయితే బాగుంటుంది అనేది గద్వాల ప్రజల మనోగతం.
కబ్జా విషయం పై చర్యలు తీసుకుంటాం
ఈ విషయంపై గద్వాల్ తాసిల్దార్ ని అడగగ ప్రభుత్వ స్థలం కబ్జాకు గురయింటే విచారణ జరిపి పై అధికారులకు తెలియజేసి చర్యలుతీసుకుంటాము.
మల్లికార్జున్ తాసిల్దార్ గద్వాల