04-09-2025 12:00:00 AM
రోగులకు గోల్డెన్ అవర్‌లో అందనున్న చికిత్స
మేడ్చల్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి) : మెడిసిటీ గ్రూప్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మేడ్చల్ లోని మెడినోవ ఆసుపత్రిలో క్యాథ్ ల్యాబ్ ను కార్డియాలజిస్ట్ డాక్టర్ జగదీష్ రెడ్డి ప్రారంభించారు. గుండెపోటు, యాంజియో ప్లాస్టి, యాంజియోగ్రామ్, ఫేస్ మేకర్ తదితర వైద్య సేవలు ఇక్కడ అందుబాటులో ఉంటాయని డాక్టర్ జగదీశ్ రెడ్డి, మెడిసిటీ సీఈవో ఇనిష్ మర్చంట్ తెలిపారు.
కార్డియాలజీ తో పాటు న్యూరాలజీ, న్యూరో సర్జరీ, బ్రెయిన్ స్ట్రోక్, మెడికల్ అండ్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, భార్యాటిక్ సర్జరీ, యూరాలజీ అండ్ నెఫ్రాలజీ, వాస్కులర్ అండ్ డయాబెటిక్ ఫుట్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ వంటి వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. అత్యవసర సమయంలో గోల్డెన్ అవర్లో వైద్యం అందడం ముఖ్యమని, మేడ్చల్‌లోని మెడినోవాలో గోల్డెన్ అవర్ లో వైద్యం అందుతుందన్నారు.