04-09-2025 12:00:00 AM
మద్దతు తెలిపిన మాజీ కౌన్సిలర్‌పై సీఐ దాడి
చెన్నూర్, సెప్టెంబర్ 3: చెన్నూరు నియో జక వర్గంలో కేంద్రంలో బుధవారం రైతులు యూరియా కోసం ధర్నా నిర్వహించారు. ధర్నా చేస్తుంటే బీఆర్‌ఎస్ నాయకులు, మాజీ కౌన్సిలర్ అనిల్ వారికి మద్దతు తెలిపారు. ఎరువులను సకాలంలో రైతులకు అందజేయాలని రైతులతో కలిసి నినదించా రు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న చెన్నూ రు సీఐ దేవేందర్ రావు ఆందోళనకారులను చెదరగొట్టే క్రమంలో మాజీ కౌన్సిలర్ అనిల్ ను నెట్టివేశారు.
ఈ చర్యను బీఆర్‌ఎస్ నాయ కులతో పాటు రైతులు సైతం వ్యతిరేకిం చారు. సీఐ దేవేందర్ రావు తీరును విమ ర్శించారు. మాజీ కౌన్సిలర్ అనిల్ పట్ల సీఐ ప్రవర్తించిన తీరును నిరసిస్తూ బీఆర్‌ఎస్ నియోజక వర్గ ఇంఛార్జీ డాక్టర్ రాజా రమేష్ ఆధ్వర్యంలో బుధవారం పోలీస్ స్టేషన్ నుం చి ధర్నా నిర్వహించారు.
రైతులకు అవసర మైన యూరియా తెప్పించకుండా ఇబ్బం దులు పెడుతుంటే ధర్నా చేస్తున్న వారిపై విరుచుకు పడి మంత్రి మెప్పుకోసం చూస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిం చారు. చెన్నూర్ రూరల్ సీఐ బన్సీలాల్ సంఘటన స్థలానికి చేరుకొని బీఆర్‌ఎస్ నాయకులతో మాట్లాడి ఆందోళనను విర మింపజేశారు. ఈ ధర్నాలో బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.