11-09-2025 01:46:43 AM
నిజామాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): నిజామాబాద్ నగర శివారు బోర్గం గ్రామ బ్రిడ్జి క్రింద ఓ యువకుడి శవన్నీ పట్టణ నాలుగవ టౌను పోలీసులు గుర్తించారు. మృతుడు కొన్ని సంవత్సరాలుగా బోర్గాం గ్రామంలో ఉంటూ పశువుల కాపరిగా పనిచేస్తూ జీవనం సాగి స్తున్నట్లు తెలుస్తోంది. మృతుడిని సిరిపూర్ శ్రీనివాస్ గా గుర్తించారు.
సిరిపూర్ శ్రీనివాస్ తన రెండవ భార్య ఇద్దరు పిల్లలతో బోర్గాం గ్రామంలో నివసిస్తున్నట్టు గ్రామస్తుల ద్వారా తెలుస్తోంది బుధవారం ఉదయం పట్టణ నాలుగో టౌన్ పోలీసులు తమకు అందిన సమాచారం మేరకు మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టంకై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ నాలుగో టౌను పోలీసులు తెలిపారు