09-07-2025 01:08:40 AM
హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రైల్వే శాఖకు చెందిన అధికారి, ఆయన భార్యపై మంగళవారం సీబీఐ అవినీతి చట్టం కింద కేసు నమోదు చేసింది. సికింద్రాబాద్ సంచాలన్ భవన్‌లో సూపరింటెండెంట్‌గా పనిచేసే రాజశేఖర్, ఆయన భార్య నవనీత ఆ దాయ పన్ను రిటర్న్స్ ఫైల్ చేయడం లేదని గుర్తించిన సీబీఐ.. ఏకకాలంలో 6 చోట్ల దాడులు నిర్వహించి 29 ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకుంది. 2017 మధ్య రూ.1.54 కోట్ల అక్రమాస్తులు సంపాదించినట్టుగా గుర్తిం చి కేసు నమోదు చేశారు.