09-07-2025 01:07:14 AM
హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవక లపై విచారణ చేపడుతోన్న కమిషన్ విచారణ ప్రక్రియ తుది దశకు చేరుకుంటోంది. నీటిపారుదలశాఖ మాజీ ఈఎన్‌సీ అనిల్ కుమార్‌కు ఈ నెల 9న విచారణకు హాజరు కావాలని మ రోసారి కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన బు ధవారం హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌లో కమిషన్ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. గతంలో ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై ఆయన నుంచి మరోసారి వివరణ తీసుకోనున్నారు.
మేడి గడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు గ్రౌటింగ్‌పై ఈఎన్‌సీ నుంచి కమిషన్ వివరణ కోరనున్నట్లు తెలుస్తోంది. బ్యారేజీకు గ్రౌటింగ్ చేసిన విషయాన్ని ఇప్పటికే జరిగిన విచారణలో అనిల్ కుమార్ దాచిపెట్టిన విషయాన్ని కమిషన్ గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అనిల్‌కుమార్‌కు కమిషన్ మరోసారి కమిషన్ నోటీసులు ఇచ్చింది. అధికారులు, ప్రజా ప్రతినిధులు, కేంద్ర సంస్థల అధికారులు, కాంట్రాక్టర్లు, సాంకేతిక నిపుణులు, ఇతర ప్రముఖుల నుంచి స్టేట్‌మెంట్స్ తీసుకున్న కమిషన్.. డ్రాఫ్ట్ రిపోర్ట్‌ను సిద్దం చేసినట్టు తెలుస్తోంది. పూర్తి నివేదికను ఈ నెలాఖరు వరకు ఇవ్వనున్న ట్టు సమాచారం.