calender_icon.png 31 October, 2025 | 6:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్ ఫలితం తర్వాత బీఆర్‌ఎస్ ఉండదు

31-10-2025 01:31:29 AM

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 

హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓడిపోలేదా..? జూబ్లీహిల్స్ ఫలితం తర్వాత బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణలోనే ఉండదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓడిపోవడమనేది కల్లా అని, తమ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఓడిపోతే ప్రభు త్వం పడిపోతుందని కేటీఆర్ గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నారని, అది ఎప్పుడు జరగదని పేర్కొన్నారు.

కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో బీఆర్‌ఎస్ చేస్తున్న కుట్రలు, కుతంత్రం బయటపడిందని గురువారం ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు. సీఎం కుర్చీలో రేవంత్‌రెడ్డి కూర్చో వడం కేటీఆర్ జీర్ణించుకోలేక తెగ గింజుకుంటున్నాడని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే తమ ప్రభుత్వం కూలిపోతుం దని నీచపు మాటలు మాట్లాడిన వ్యక్తి కేటీఆర్ అని మండిపడ్డారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఉంటుందో.. లేఖ బంగాళాఖాతంలో కలుస్తుందో చూసుకోవాలని హితవు పలికారు.