13-07-2025 12:01:42 AM
అడిషనల్ డీసీపీ వెంకటరమణ..
కాప్రా: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని అడిషనల్ డీసీపీ వెంకటరమణ(Additional DCP Venkataramana), ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Bandari Lakshma Reddy) పేర్కొన్నారు. శనివారం కాప్రా సర్కిల్ మీర్పేట్ హెచ్బి కాలనీ డివిజన్, తిరుమల నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను వారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఒక సీసీ కెమెరా వంద మంది మనుషులతో సమానమన్నారు. నేరాలు జరగకుండా నిరోధించడంలోనూ, నేరాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించడంలోనూ సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అన్ని కాలనీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కుషాయిగూడ ఏసీపీ వెంకట్ రెడ్డి, సీఐ భాస్కర్ రెడ్డి, కార్పొరేటర్ జెర్రీపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్లు గుండారం శ్రీనివాస్ రెడ్డి, గొల్లూరి అంజయ్య, నాయకులు మునిగంటి రామ్ ప్రదీప్, ముత్యం వెంకన్న గౌడ్, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. సీసీ కెమెరాల ప్రారంభోత్సవం అనంతరం, అసోసియేషన్, స్కూల్ మైదానంలో మొక్కలునాటారు.