07-11-2025 12:53:45 AM
నాగల్ గిద్ద, నవంబర్ 6: నాగల్ గిద్ద మండల పరిధిలోని పుసల్ పాడ్ గేట్ దగ్గర ఉన్న విజయ కాటన్ మిల్లులో గురువారం సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్నిడాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ప్రారంభించారు. అనంతరం సిసిఐ అధికారులతో మాట్లాడుతూ ఈ సంవత్సరం వర్షాలు అధికం ఉండడంతో పత్తి రైతులు తీవ్ర నష్టాలపాలు కావడం జరిగిందన్నారు.
పత్తిలో తేమ శాతం కొంచెం ఎక్కువ, తక్కువగా ఉన్నా రైతులకు నష్టం జరగకుండా న్యాయం జరిగే విధంగా సీసీఐ అధికారులు చూసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో విజయ కాటన్ మిల్ యాజమాన్య బృందం, పండరి, నాయకులు పాల్గొన్నారు.