calender_icon.png 14 August, 2025 | 1:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

14-08-2025 12:26:56 AM

చండూర్ మున్సిపల్ కమిషనర్ ఎల్. మల్లేశం

 చండూరు, ఆగస్టు 13:  వాతావరణ శాఖ సూచన మేరకు రాబోయే మూడు రోజులపాటు భారీ వర్షాల దృష్ట్యా  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చండూరు మున్సి పల్ కమిషనర్ ఎల్. మల్లేశం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున తమ సిబ్బందిని వరద సహా యక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

వరద ప్రభావిత ప్రాంతాలు, వాగులు, లోతంటూ ప్రాంతాలలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల సమీపానికి వెళ్లకూడదని, రైతులు పొలాలలో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తలు వహించాలని, చేపల వేటకు ఎవరు వెళ్లకూడదని, అత్యవసర సమయాల్లో మాత్రమే ప్రజలు బయటికి రావాలని ఆయన అన్నారు. తమ సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు.