calender_icon.png 10 September, 2025 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆల్ఫోర్స్ లో ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు

09-09-2025 09:51:38 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): నగరంలోని వావిలాలపల్లి అల్ఫోర్స్ ఇ-టెక్నో కళాశాలలో తెలంగాణ భాష దినోత్సవ వేడుకలు, కాళోజి నారాయణరావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా అదనపు కలెక్టర్ డా.అశ్విని తానాజీ వాకడే(District Additional Collector Ashwini Tanaji Wakade) అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి, కరీంనగర్ జిల్లా క్వాలిటీ కో-ఆర్డినేటర్ అశోక్ రెడ్డి, ప్రముఖ కవి డాక్టర్ కెప్టెన్ మధుసూదన్ రెడ్డితో కలిసి కాళోజి చిత్రపటానికి పూలమాలలు వేసిన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు తెలంగాణ ఉద్యమానికి గొప్ప ప్రతీకని, వారు ఇచ్చిన స్ఫూర్తి నేటికి కొనసాగుతున్నదని అన్నారు. అనంతరం తెలుగు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.