calender_icon.png 10 September, 2025 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిమాండ్ ఉన్న పంటలు సాగు.. ఎకరానికి లక్షన్నర ఆదాయం

09-09-2025 09:47:28 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల సాగు వల్ల రైతులకు అధిక ఆదాయం లభిస్తుందని, ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో కూరగాయలు, ఆయిల్ పామ్ పంటల సాగుతో అనేకమంది రైతులు ఎకరానికి లక్ష రూపాయల ఆదాయం పొందుతున్నారని జిల్లా హార్టికల్చర్(District Horticulture) అధికారి మరియన్న తెలిపారు. మహబూబాబాద్, నెల్లికుదురు మండలాల్లో ఉద్యానవన పంటలను పరిశీలించారు. జిల్లాలో అన్ని మండలాల్లో ఆయిల్ పామ్ సాగు, పండ్ల తోటలు, కూరగాయలు, మల్బరీ, పూలు, మునగ మొదలైన మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలు రైతులు సాగు చేస్తున్నారన్నారు. రైతులకు ఆయా పంటల సాగుకు అవసరమైన సూచనలు ఇస్తున్నట్లు చెప్పారు. ఆయిల్ పామ్, కూరగాయలు, పండ్లు, పూలు, మునగ , మల్బరీ వంటి పంటలు సాగు చేయాలని, ప్రభుత్వ ప్రోత్సాహక రాయితీలు పొందాలని విజ్ఞప్తి చేశారు. క్షేత్ర సందర్శనలో రైతులు రమేష్, బాలు, నరేష్, యాకన్న, భిక్షం, పద్మ, ఫీల్డ్ అధికారులు కిషోర్, నర్మద, రాజుకుమార్ తదితరులు పాల్గొన్నారు.