29-12-2025 01:52:46 AM
తూప్రాన్, డిసెంబర్ 28 :తూప్రాన్ మండలం దాతర్ పల్లి ప్రేయర్ పవర్ చర్చిలో క్రిస్మస్, ముందస్తు నూతన సంవత్సర సంబరాలను పాస్టర్ శ్యామ్ అబ్రహం మిత్ర బృందం ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలకు దాతరపల్లి నూతన గ్రామ సర్పంచ్ జయరాములు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చర్చి పాస్టర్లు సర్పంచ్ జయరాములు, ఉప సర్పంచ్ ప్రవీణ్ లను శాలువాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో కళాబృందం చిన్నారులు ఆటపాటలతో చక్కగా అలరించారు. ఈ వేడుకలు బిలీవర్ మేకల నాగరాజు ఆధ్వర్యంలో జరిగాయి. ఇందులో పాస్టర్ శ్యామ్ అబ్రహం, పాస్టర్ జీవరత్నం, రాజశేఖర్ అతిథులుగా విచ్చేశారు. వీరందరి చేతుల మీదుగా ప్రేయర్ పవర్ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సంబరాలలో గ్రామస్తులు మల్లేష్, నెల్లూరు, ప్రభుదాసు, యువకులు, మహిళలు, చిన్నారులు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు.