09-05-2025 02:07:19 AM
-చెత్త సేకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం
-మంత్రి సీతక్క ఆదేశాల మేరకు స్వచ్ఛదనం పెంచే కార్యాచరణ
-పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కసరత్తులు కొలిక్కి
హైదరాబాద్, మే ౮ (విజయక్రాంతి): గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా స్వచ్ఛ పల్లెలే లక్ష్యంగా సరికొత్త యాప్‌ను రూపొందించింది.
తద్వా రా చెత్త సేకరణ సమస్యకు శాశ్వత పరిష్కా రం చూపనుంది. ఎన్ని చర్యలు చేపట్టినా పం చాయతీల్లో చెత్త సేకరణ సరిగా ఉండకపోవడం, డంపింగ్ యార్డులతో పంచాయతీల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క ఆదేశాల మేరకు స్వచ్ఛదనం పెంచే దిశలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కార్యాచరణను రూపొందించారు. దీంతో చెత్త సేకరణ పర్యవేక్షణ కోసం ప్రత్యేక యాప్ ను రూపొందించారు. వారం, పది రోజుల్లో ఈ యాప్ అందుబాటులోకి రానున్నది.
ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులకు పీఎస్ యాప్ అందింది. ఆ యాప్‌లో పంచాయతీ ల నిర్వహణపై ఎప్పటికప్పుడు సమాచారా న్ని పొందుపరుస్తున్నారు. ప్రతిరోజు కాలువలు, వీధులు, ఇన్ స్టిట్యూషన్లను శుభ్రపరి చే సమాచారం, ఫొటోలను చేరుస్తున్నారు.
తడిచెత్త ఎంత.. పొడిచెత్త ఎంత..
ఇప్పుడు అదే యాప్‌లో మరో ఆప్షన్‌ను ప్రభుత్వం చేర్చింది. ఆ ఆప్షన్ ద్వారా ప్రతిరోజు గ్రామంలో ఎన్ని నివాసాల నుంచి చెత్త సేకరించారు. ఎంత మేర చెత్త పోగయ్యింది. అందులో తడి చెత్త, పొడి చెత్త ఎం త వంటి సమాచారాన్ని పంచాయతీ కార్యదర్శులు అప్‌లోడ్ చేయనున్నారు.
యాప్‌లో అప్‌లోడ్ చేసిన సమచారాన్ని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. సేకరించిన చెత్తను ఎక్కడో ఒక చోట డంప్ చేయకుండా చర్యలుతీసుకోనున్నారు. తడి చెత్తను 60 రోజులో ఎరువుగా మార్చాలి, కేజీ పొడి చెత్త 60 రోజుల్లో 150 గ్రాముల ఎరువుగా మారుతుంది.
ప్లాస్టిక్, సీసాలు వంటి పొడి చెత్తను ప్లాస్టిక్ డిస్పోస్ కేంద్రాలకు తరలించడం లేక అమ్మేయడం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో గ్రామాల్లో డంప్ చేయకూడదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో ఒక్కో వ్యక్తి కనీసం 100 గ్రాముల చెత్తను జనరేట్ చేస్తారని అంచనా.
దానికనుగుణంగా ఆయా గ్రామాల్లో అంత మేర చెత్త సేకరణ జరగకపోతే పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేనట్టుగా గుర్తిస్తారు. అలాంటి సందర్భంలో పంచాయతీ కార్యదర్శిని అప్రమత్తం చేసి, చెత్త సేకరణ ప్రక్రియను మెరుగుపరిచేలా అధికారులు ఆదేశాలిస్తారు. యాప్ ద్వారా నిత్యం చెత్త సేకరణ ప్రక్రియను పర్యవేక్షించడం ద్వారా గ్రామాల్లో స్వచ్ఛదనం పెరుగనున్నది.