calender_icon.png 9 September, 2025 | 12:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

05-09-2025 12:00:00 AM

 పెద్ద అంబర్‌పేట్ మున్సిపల్ కమిషనర్

అబ్దుల్లాపూర్‌మెట్, సెప్టెంబర్ 4: పరిరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పెద్ద అంబర్‌పేట్ మున్సిపల్ కమిషనర్ ఎస్.రవీందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 100 రోజుల ప్రణాళికలో భాగంగా పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధి పెద్ద అంబర్‌పేట్ నుంచి కుంట్లూరు వెళ్లే రహదారి పొడువున ఉన్న  పిచ్చి మొక్కలు తొలగించారు.

అదే విధంగా వనమహోత్సవంలో సందర్భంగా కుంట్లూరులో రోడ్డుకు  ఇరువైపుల మొక్కలు నాటారు. అలాగే కుంట్లూరు పట్టణ మహిళా సంఘాల రిసోర్స్ పర్సన్స్ ఏర్పాటు చేసిన ఆహార, వస్తు, ఉత్పతులను స్టాల్స్ మున్సిపల్ పరిపాలన శాఖ జాయింట్ డైరెక్టర్ నారాయణరావుతో కలిసి మున్సిపల్ కమిషనర్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.