31-10-2025 01:08:08 AM
 
							చేగుంట, అక్టోబర్ 30 :చేగుంటకు చెందిన శతాధిక వృద్ధురాలు మురాడి నర్సమ్మ(105) మృతి చెందారు. నర్సమ్మ 1920లో జన్మించారు.మొట్టమొదటి ఎన్నికల నుండి చివరి ఎంపీ ఎలక్షన్ వరకు అన్ని ఎన్నికలలో ఓటు వేసింది. తను 90 సంవత్సరాల వయస్సు వరకు పొలం పనులు చేశారు. మూడు నెలల ముందు వరకు కూడా తన పనులు తానే చేసుకున్నారు.
నర్సమ్మ భర్త మురాడి సాయిలు చేగుంటకు రెండవ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికై మరణించే వరకు గ్రామానికి సేవ చేశారు. సర్పంచ్ కాకముందు చేగుంటకు ఉపసర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికై దాదాపు 26 సంవత్సరాలు సేవ చేశారు. వీరి కుమారుడు మురాడి ముత్యాలు చేగుంట పిఏసిఎస్ ఛైర్మెన్ గా పనిచేశారు. నర్సమ్మకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. కుమారుడు, పెద్ద కుమార్తె చనిపోగా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.