calender_icon.png 29 January, 2026 | 8:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ కేంద్రానికి మార్పు రాదా?

29-01-2026 12:55:51 AM

మంత్రులు ఎమ్మెల్యేలచే ప్రారంభాలు

కలెక్టర్ ఆదేశాలు బేఖాతారు

నిత్యం తాళం- ప్రజాధనం వృధా

చేపలు విక్రయించే మినీ డీసీఎంలు ఎక్కడ

బస్టాండ్‌లో చేపల విక్రయాలు 

మత్స్యశాఖ మాటలు నీటి మూటలే

మత్స్యకారుల సంఘం ఇకనైనా మారుతుందా 

గోపాలపేట జనవరి 28 : విజయక్రాంతి కథనాలకు జిల్లా కలెక్టర్ లో చలనం వచ్చినా గోపాలపేట మత్స్యకారుల సంఘాల్లో మార్పు రాలేదు. ఈ చేపల విక్రయ కేంద్రానికి నిత్యం తాళం వేసిందే దర్శనమిస్తుంది. మరి చేపలు విక్రయించే మత్స్యకారుల సంఘానికి మార్పు ఎందుకు రావడం లేదో మత్స్యశాఖ అధికారులే తేల్చి చెప్పాలి. వనపర్తి జిల్లా గోపాలపేట మండల కేంద్రంలోని హైదరాబాదు రహదారి లో ప్రధాన రోడ్డు పక్కనే లక్షల రూపాయల ప్రజాధనం వృధా అయినట్టు ప్రజలు చర్చించుకుంటున్నారు. 3-8 - 2018 సుమారుగా 8 ఏళ్లు గడుస్తుంది. చాపల విక్రయ కేంద్రం మంత్రులు- ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ మత్స్యశాఖ అధికారులు ఎన్నో అంగులతో ప్రారంభించారు.

కానీ గోపాలపేట చేపల విక్రయ కేంద్రం మొక్క బడిగా తెరచి ఏళ్ల తరబడి మూసి ఉంచారు. 2016-17 సంవత్సరానికి సంబంధించిన నిధులు 10 లక్షల చే గోపాలపేట మండల కేంద్రంలో హైదరాబాద్ ప్రధాన రహదారి పక్కనే ఎన్నో హంగులతో నిర్మించారు. అప్పటి ప్రభుత్వం మత్స్యకారులకు ఉపాధి కల్పించాలన్న సంకల్పంతో అప్పటి ప్రభు త్వం మత్స్యకారులకు మోటార్ సైకిల్. వేరే ప్రాంతాలకు తీసుకెళ్లి చేపలను విక్రయించేందుకు మినీ డీసీఎంలను కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకారులకు అందజేసింది.

చేపల మినీ డిసీఎంల జాడేది...? 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలను ఖర్చు చేసి మత్స్యకారులు చెరువుల వద్ద చేపలు పట్టుకుని ఊరు రా తిరిగీ అమ్ముకోవడానికి ప్రభుత్వం మత్స్యకారులకు అందజేసింది కానీ ప్రస్తుతం చేపల మినీ డీసీఎం లో ఎక్కడ కూడా కనపడటం లేదని ప్రజలు చెప్పుకుంటున్నారు. చేపల మినీ డీసీఎం చేపల విక్రయానికి కాదండోయ్ మరో పనుల కోసం వాడుకుంటు న్నారు. వనపర్తి జిల్లాలోని కొన్ని గ్రామాలలో పశువులను సంతక తీసుకెళ్లడమో, మరో పనులకు వాడుతున్నారు కానీ ఇవి చేపలు అమ్ముకోవడానికి మాత్రం ఎక్కడా కనిపించడం లేదు..

కలెక్టర్ ఆదేశాలు బేఖాతారు ...

మండల కేంద్రంలో లక్షల రూపాయలు ఖర్చు చేసి చేపల విక్రయ కేంద్రాన్ని ప్రభు త్వం నిర్మించింది. కానీ మత్స్యకారులు అక్క డ చేపలు విక్రయించడం లేదని దీంతో ఆ చేపల విక్రయ కేంద్రం శిథిలావస్థకు చేరుతుందని పలుమార్లు విజయ క్రాంతి పత్రిక కథనాలు ప్రచురించింది దీంతో అందించిన జిల్లా కలెక్టర్ మత్స్యశాఖ అధికారులతో కలి సి వచ్చి శిథిలావస్థకు చేరిన చేపల విక్రయ కేంద్రాన్ని వెంటనే శుభ్రం చేయించి మళ్లీ రీ కేంద్రంగా మార్చారు. ప్రతివారం గోపాలపేట బస్టాండ్ లో విక్రయిస్తున్న చేపలు ఈ చేపల విక్రయ కేంద్రంలోని అమ్ముకోవాలని ఆదేశించారు. వెంటనే గోపాలపేట మత్స్య మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు బాలరాజు జిల్లా కలెక్టర్కు శాలువాతో సన్మానం చేసి ఇ కనుంచి ఇక్కడే చేపల అమ్మేలా చూస్తామని హామీ ఇచ్చారు.

మత్స్యశాఖ అధికారుల మాటలు నీటి మూటలే ...

మత్స్యకారుల సంఘం తరఫున అధ్యక్షుడు చర్చలు జరిపి ప్రతి సంతలో వనపర్తి నుంచి వచ్చిన విక్రయదారులు ఇక్కడికి వ చ్చి అమ్ముకునేలా కార్యదర్శి సర్పంచులు చూసే బాధ్యత ఉంది వారు కూడా ముఖం చాటేశారు. మళ్లీ అదే పాటుగా చేపలను బస్టాండ్ లోనే విక్రయిస్తున్నారు. దీంతో జి ల్లా మత్స్యశాఖ అధికారుల మాటలు నీటి మూటలుగా కనిపిస్తుంది.

నిత్యం తాళం- ప్రజాధనం వృధా... 

ఎన్నో హంగులతో అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు 2018 లో ఒకటో ఒకటిన సరళ సాగర్, సింగోటం వంటి పెద్ద చెరువుల్లో రకరకాల పెద్ద పెద్ద చేపలు తీసుకొచ్చి చేపల విక్రయ కేంద్రం ప్రారంభంలో మత్స్యకారులు రంగురంగుల బట్టలు వేసుకొని మం త్రులు ఎమ్మెల్యేల మధ్యలో ఉండి విక్రయించారు. కానీ మరి తెలంగాణ ప్రభుత్వం అప్ప ట్లో చెరువుల్లోకి నిండుకుండలా నీరు వదిలి ఉచితంగా ప్రభుత్వమే చేపలను వదిలింది అట్టి చేపలను మత్స్యకారులు పట్టుకొచ్చి ఇక్కడే విక్రయించాలని చేపల విక్రయ కేంద్రాలను లక్షల రూపాయలతో కట్టించింది. కానీ మత్స్యకారులు చెరువుల వద్దే దళారులకు అమ్ముకోవడమే కాకుండా ఉన్న చేపలు విక్రయ కేంద్రంలో విక్రయించకుండా బ స్టాండ్ లో అమ్ముకోవడం పట్ల ఈ విక్రయ కేంద్రానికి ఇలా నిత్యం తాళమే కనిపిస్తుంది.

మత్స్యకారులు ఇకనైనా మారుతారా

మత్స్యకారులు ఉపాధి కోసం ప్రభుత్వం ఎంతో సంకల్పంతో మాకు ఇక్కడ ఆదా యం రావడానికి చేపల విక్రయ కేంద్రాన్ని నిర్మించారే కానీ మేమెందుకు లక్షలతో నిర్మించిన కేంద్రాన్ని ఉపయోగించుకోవడంలేదని మాలో ఎందుకు చలనం రాకుండా పోతుందని ఆలోచించుకోవాలి కదా- ఇలా జిల్లా కలెక్టర్లు మత్స్యశాఖ అధికారులు మనకు మొట్టికాయలు వేస్తేనే మనం మేలుకుంటామా ఇకనైనా మారి ఈ విక్రయ కేంద్రాన్ని వినియోగంలోకి తీసుకువచ్చి అభివృద్ధి చేసుకుందాం .

మార్కెట్ అభివృద్ధి కోసం కృషి చేస్తాం..

 గోపాలపేట మండల కేంద్రం అభివృద్ధిక లోకి తేవాలంటే ప్రతి ఒ క్కటి వినియోగంలోకి తీసుకు రావాలి కాబట్టి అంత విలువైన చేపల మా ర్కెట్ మూతపడకుండా ప్రతివారం సం తలో చేపలు విక్రయించకుండా ప్ర జాధనంతో నిర్మించిన చేపల మార్కెట్ లోని విక్రయించే లా కృషి చేస్తాం దానివల్ల ఆ చుట్టుపక్కల డెవలప్ కూడా అ వుతుంది. మా సంబంధిత అధికారుల తో మాట్లాడి చేపలు ప్రతి ఒక్కరు కూడా మార్కెట్లోని విక్రయించేలా చూస్తాం.

సర్పంచ్ కర్రోళ్ల స్వప్న భాస్కర్ 

చేపలను విక్రయ కేంద్రంలో అమ్మి చూడండి. తప్పక వినియోగంలోకి వస్తుంది 

గోపాలపేట మన మండల కేం ద్రంలో లక్షల రూ పాయలు ఖర్చు చే సి ప్రభుత్వం మన కోసం చేపల విక్ర య కేంద్రాన్ని ని ర్మించడం గొప్ప విషయం అలాంటి కేం ద్రాన్ని వృధాగా వదిలేస్తే అది కాస్త శిథిలావస్థకు చేరి చూడడానికి కూడా ఇక్కడ చేపల కేంద్రం ఉంటుంది కదా అనిపిస్తుంది. మరి ఈ విక్రయ కేంద్రంలో మ త్స్యకారులు మనకు అందుబాటులో ఉన్న చెరువుల్లో చేపలు పట్టుకొని ఇక్కడ విక్రయించాలి. కొన్ని మార్లు చేపలను ఇక్కడ అమ్ముకొని చూడండి ప్రజలు ఎందుకు రారో తెలుస్తుంది. ఎందుకంటే చేపలు కిరాణం షాపుల్లో దొరకవు. వైన్ షాప్ అయినా కళ్ళు దుకాణమైన చేపల మార్కెట్ అయినా ఎంత దూరం ఉన్నా కావాల్సిన వారు తప్పక అక్కడికి వెళ్లాల్సిందే కాబట్టి మనం ఈ కేంద్రాన్ని విని యోగంలోకి తెద్దాం.. 

పి. సురేష్. వార్డు మెంబర్