23-10-2025 02:00:40 AM
కాకతీయ యూనివర్సిటీ, అక్టోబర్ 22(విజయక్రాంతి): కాకతీయ విశ్వవిద్యాలయ క్యాంపస్లో రూ. 3.5 కోట్ల వ్యయంతో, రుసా నిధుల ద్వారా నిర్మించబోయే ‘సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ సెం టర్ బిల్డింగ్‘ కు వైస్ చాన్స్‌లర్ ఆచార్య కె. ప్రతాప్ రెడ్డి భూమిపూజ నిర్వహించారు. ఈ భవనం మొత్తం రెండు అంతస్తులతో నిర్మించబడనుండగా, ప్రతి అంతస్తు 6,786 చదరపు అడుగుల వి స్తీర్ణం కలిగి ఉంటుంది.
రుసా నిధుల ద్వారా పొందిన ఆధునిక పరికరాలను ఈ భవనంలో ఏ ర్పాటు చేసి, విద్యా, పరిశోధన అవసరాలకు వినియోగించనున్నట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం, అభివృద్ధి అధికారి ఆచార్య వాసుదేవ రెడ్డి వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం, పాలక మండలి సభ్యులు ఆచార్య బి. సురేష్ లాల్, డాక్టర్ బి. రమ, డాక్టర్ సుదర్శన్, డాక్టర్ చిర్రా రాజు, డాక్టర్ సుకుమారి, ఆచార్య ఎం. నవీన్, రుసా నోడల్ ఆఫీసర్ ఆచార్య మల్లికార్జున రెడ్డి, వివిధ డీన్లు, ప్రిన్సిపాళ్లు, విభాగాధిపతులు, ప్రా జెక్ట్ అధికారులు, బోధనా మరియు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. అలాగే డిప్యూటీ ఇంజనీర్ రామిశెట్టి రవీందర్, బిల్డింగ్ డివిజన్ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.