05-07-2025 07:22:50 PM
చండూరు,(విజయక్రాంతి): గట్టుప్పల గ్రామంలో స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ కార్యక్రమం కింద చేపట్టిన అభివృద్ధి పనులను కేంద్ర ప్రభుత్వం నియమించిన తనిఖీ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ తనిఖీ సందర్భంగా వ్యక్తిగత మరుగుదొడ్లు, సామూహిక ఇంకుడు గుంతలు, ప్రభుత్వ కార్యాలయాల పారిశుద్ధ్య నిర్వహణ, కంపోస్ట్ షెడ్ నిర్వహణ తదితర అంశాలను పరిశీలించిన అధికారులు నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.