12-07-2025 05:44:51 PM
మరుగుదొడ్లు సామాజిక భవనాల పరిశీలన..
బోయినపల్లి (విజయక్రాంతి): బోయినపల్లి మండలంలోని 23 గ్రామాలకు గాను ఎంపిక చేసిన మూడు గ్రామాల్లో కేంద్ర బృందం సభ్యులు జిల్లా అధికారులు మరుగుదొడ్లను సామాజిక భవనాలను పరిశీలించారు. స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా కేంద్ర బృందం టీం సభ్యులైన అనూష, శిరీష లు కోరేం, రామన్నపేట, స్తంభం పెళ్లి గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం నిర్వహణ ప్రభుత్వ పాఠశాలలోని కమ్యూనిటీ టాయిలెట్స్ సామాజిక భవనాలను, ఇంకుడు గుంతలను ప్రజలు వినియోగిస్తున్న తీరును పరిశీలించారు.
పాఠశాలలో గ్రేట్ వాటర్ మేనేజ్మెంట్ లో భాగంగా కిచెన్ గార్డెన్ పనితీరుతో పాటు అంగన్వాడి కేంద్రాల్లో ప్రాథమిక ఉప వైద్య కేంద్రాల్లో డ్రైన్ రెండు ఏండు పాయింట్లులో వినియోగిస్తున్న ఇంకుడు గుంతలను, గ్రామపంచాయతీలో ట్రాక్టర్ ద్వారా తడి చెత్త పొడి చెత్త సేకరించే విధానంతో పాటు, కంపోస్ట్ షెడ్ నిర్వహణ ఎస్సీ ఎస్టీ కాలనీలో గృహాలను వసతులను డ్రైనేజీ నిర్వహణను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వచ్చిన అధికారులకు కార్యాదర్శులు స్వాగతం పలికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జయశీల ఎంపీఓ శ్రీధర్ గ్రామాల కార్యదర్శులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి లు పాల్గొన్నారు.