calender_icon.png 9 December, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరంగేట్రంలోనే సెంచరీ

09-12-2025 01:22:32 AM

  1. బరోడా క్రికెటర్ ప్రపంచ రికార్డ్

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ

హైదరాబాద్, డిసెంబర్ 8 : దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బ్యాటర్లు దుమ్మురేపుతున్నారు. ఇప్పటికే పలు సెంచరీలు నమోదవగా, బౌలర్లకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. తాజాగా సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో బరోడా వికె ట్ కీపర్ బ్యాటర్ అమిత్ పాసి ప్రపంచ రికా ర్డ్ సృష్టించాడు.తన తొలి టీ20 మ్యాచ్‌లోనే శతకం సాధించి ఔరా అనిపించాడు.హైదరాబాద్ జింఖానా గ్రౌండ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో అమిత్ పాసి కేవలం 55 బంతుల్లోనే 114 పురుగులు చేశాడు. దీనిలో 10 ఫోర్లు, 9 సిక్సర్లున్నాయి.

తద్వారా తొలి మ్యా చ్‌లోనే పాక్ క్రికెటర్ బిలాల్ ఆసిఫ్ 2015లో నెలకొల్పిన రికార్డును సమం చేశాడు. అలా గే అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన మూడో భారత బ్యాటర్‌గా అమిత్ పాసి రికార్డులకెక్కాడు. హతంలో ఛండీఘడ్ క్రికెటర్ హిమాచల్‌ప్రదేశ్‌పై 106 పరుగులు చేశాడు. అలాగే 2010లో హైదరాబాద్ క్రికెటర్ అక్షత్ రెడ్డి ముంబైపై 105 పరుగులు చేశాడు.

ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన అమిత్ పాసి 24 బంతుల్లోనే హాఫ్  సెంచరీ, 44 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో బరోడా 220 పరుగులు చేయగా.. ఛేజింగ్ లో రైల్వేస్ సర్వీసెస్ 207 పరుగులకే పరిమితమైంది. ఇక ఐపీఎల్ మినీ వేలానికి సమ యం దగ్గర పడుతుండడంతో పలువురు యువ ఆటగాళ్ళు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో దుమ్మురేపుతూ ఫ్రాంచైజీలను ఆకర్షిస్తున్నారు.