09-12-2025 01:21:19 AM
మ్యాచ్ ఆడేది ఐదు నిమిషాలే!
హైదరాబాద్, డిసెంబర్ 8 : భారత ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అర్జెంటీనా దిగ్గజం లైనోల్ మెస్సీ ఇండియా టూర్‌కు సమయం దగ్గర పడుతోంది. భారత పర్యటనలో మెస్సీ హైదరా బాద్‌కు కూడా వస్తున్నాడు. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఆడడంతో పాటు అభిమా నులతో ముచ్చటించనున్నాడు. తాజాగా మెస్సీ టూర్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను నిర్వాహకులు వెల్లడించారు.
దీని ప్రకారం డిసెంబర్ 13న సాయంత్రం 4 గంటలకు మెస్సీ హైదరాబాద్ చేరుకుంటాడు. ఎయిర్‌పోర్టు నుంచి హోటల్‌కు వెళ్లి విశ్రాంతి తీసు కున్న అనంతరం రాత్రి 7 గంటలకు ఉప్పల్ స్టేడియానికి రానున్నాడు. స్టేడియంలో 15 నిమిషాల పాటు ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఉంటుంది. అయితే మ్యాచ్ చివరి 5 నిమిషాల్లో మాత్రమే మెస్సీ, సీఎం రేవంత్ టీమ్‌తో పోటీపడతాడు. ఆ తర్వాత స్కూల్ పిల్లలతో మెస్సీ ఇంటరాక్షన్ ఉంటుంది.
దీంతో పాటు పరేడ్, మెస్సీకి సత్కార కార్యక్రమాలు కూడా ఉంటాయి. మొత్తం మీద ఈ ఫుట్‌బాల్ స్టార్ ఉప్పల్ స్టేడియంలో గంటా 40 నిమిషాల పాటు గడుపుతాడు. సౌత్ ఇండియాలోనే అతి పెద్ద ఈవెంట్‌గా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఉప్పల్ స్టేడియంలో కార్యక్రమాలు పూర్తవగానే మెస్సీ అదే రోజు హైదరాబాద్ నుండి వెళ్ళిపోతాడని నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి పలు వురు రాజకీయ, సినీప్రముఖులు కూడా హాజరుకానున్నారు.